మహా ఎన్నికలు.. ముగిసిన పోలింగ్

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో దాదాపు 58.22 శాతం,ఝార్ఖండ్‌లో 67.59 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతాలు మరింత పెరిగే అవకాశం ఉంది.