Jammu Kashmir :ఆ ప్రాంతానికి వెళ్లవద్దు … అమెరికన్లకు ట్రంప్ సర్కార్ అడ్వైజరీ

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయానక ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా (America) అప్రమత్తమైంది. తమ దేశస్తులు ఎవరూ జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)కు ప్రయాణాలు పెట్టుకోవద్దని అడ్వైజరీని జారీ చేసింది. ఉగ్రదాడులు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే లేదా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లవద్దు. కశ్మీర్‌లో లోయలోని శ్రీనగర్ (Srinagar) , గుల్‌మార్గ్ (Gulmarg), పహల్గాంలో హింస చెలరేగవచ్చు. సైనిక ఘర్షణకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో సరిహద్దులకు 10 కిలోమీటర్ల వరకు వెళ్లవద్దు అని అమెరికా విదేశాంగశాఖ అడ్వైజరీలో పేర్కొంది.