Unemployment: భారత్‌లో స్వల్పంగా పెరిగిన నిరుద్యోగిత

భారతదేశంలో నిరుద్యోగం (Unemployment) పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో దేశవ్యాప్త నిరుద్యోగ రేటు సెప్టెంబర్‌లో స్వల్పంగా పెరిగింది. ఆగష్టులో 5.1 శాతంగా ఉన్న ఈ రేటు, సెప్టెంబర్‌లో 5.2 శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరుగుదల స్పష్టంగా కనిపించిందని, ఆగష్టులో 6.7 శాతంగా ఉన్న ఈ రేటు సెప్టెంబర్‌లో 6.8 శాతానికి (Unemployment) పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంత మహిళల్లో నిరుద్యోగ రేటు ఏకంగా 8.9 శాతం నుంచి 9.3 శాతానికి పెరగడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నిరుద్యోగం 4.6 శాతం నుంచి 4.3 శాతానికి స్వల్పంగా తగ్గింది. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా సమయంలోనే, ఎక్కువ మంది పని కోసం జాబ్ మార్కెట్‌లోకి కూడా ప్రవేశిస్తున్నారని ఈ డేటా సూచిస్తోంది.