Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో

కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. జనన ( Birth), మరణ (death) రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (Registrar General of India) నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని వెల్లడిరచింది. తద్వారా అత్యంత కచ్చితత్వంతో ఓటరు జాబితాను నవీకరించే వీలుంటుందని పేర్కొంది. నమోదిత మరణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ( ఈఆర్‌ఓ) సకాలంలో పొందే వీలుంటుంది. చనిపోయిన వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తి వచ్చేంతవరకు వేచి చూడకుండా, ఆర్‌జీఐ (RGI ) నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌ఓఎస్) క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ధ్రువీకరించుకుంటారు అని ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడిరచింది. ఎన్నికల నిబంధనలు-1960, జనన, మరణాల నమోదు చట్టం-1969 ప్రకారం ఎన్నికల సంఘానికి ఈ సమాచారాన్ని తీసుకునే అధికారం ఉంది.