Alok Joshi: జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్‌గా అలోక్ జోషి

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్‌వ్యవస్థీకరించింది. అలాగే రా మాజీ చీఫ్ అలోక్ జోషి (Alok Joshi) ని ఆ బోర్డు చైర్మన్‌గా నియమించింది. ఈ ఘటన వేళ ఈ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు ఆరుగురు సభ్యులు ఉన్నారు. భారత సైన్యంలో పనిచేసిన మాజీ అధికారులు ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా (PM Sinha), లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ (AK Singh) , అడ్మిరల్ మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్‌లు రాజీవ్ రంజన్ వర్మ (Rajiv Ranjan Verma), మన్మోహన్ సింగ్ (Manmohan Singh) , మాజీ ఐఎఫ్‌ఎస్ బి.వెంకటేశ్ వర్మ సభ్యులుగా ఉన్నారు. భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ భేటీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.