Tahawwur: తహవ్వూర్ రాణా ఎన్‌ఐఏ కస్టడీ పొడిగింపు

ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana) ఎన్‌ఐఏ కస్టడీని ఢల్లీి కోర్టు పొడిగించింది. దాంతో మరో 12 రోజులు అతడు దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉండనున్నాడు. ఇదివరకు విధించిన 18 రోజుల కస్టడీ గడువు ముగియడంతో ఈ రోజు రాణాను కోర్టుముందు హాజరుపర్చారు. అతడి ముఖం కనిపించకుండా కవర్ చేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. ఎన్‌ఐఏ (NIA) అదుపులో ఉన్న రాణాను ఇటీవల ముంబయి క్రైమ్ బ్రాంచ్ (Mumbai Crime Branch) పోలీసులు విచారించారు. ఈ విచారణకు అతడు సహకరించకుండా, తప్పించుకునే రీతీలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ముంబయి ఉగ్రదాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో భాగంగా రాణా వెల్లడిరచినట్లు తెలుస్తోంది. తహవ్వుర్ రాణా పాకిస్థాన్ (Pakistan)కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అరెస్టయ్యాడు. అమెరికా (America) జైల్లో శిక్ష అనుభవించిన అతడిని అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.