ఫ్యామిలీతో కలిసి ఓటేసిన ముకేశ్ అంబానీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపారవేత్తలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన కుమారులు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, కోడలు శ్లోకా మోహతాలో కలిసి ఓటు వేశారు.