Rahul Gandhi: రాహుల్ గాంధీ మెదడు చోరీకి గురైంది: దేవేంద్ర ఫడ్నవీస్

ఓటు చోరీపై లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ ‘అర్బన్ నక్సలైట్స్’ తరహాలో మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. రాహుల్‌కు (Rahul Gandhi) రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకం లేదని ఫడ్నవీస్ అన్నారు.
“ఓటు చోరీ జరగలేదు. దానికి బదులుగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) మెదడు చోరీకి గురైంది” అని ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. రాహుల్ సలహాదారులు కూడా అర్బన్ నక్సలైట్స్ మాదిరిగా ఉన్నారని, అందుకే ఆయన కూడా అదే భాషలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. భారత యువత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తారని, స్టార్టప్, టెక్ విప్లవానికి నాయకత్వం వహిస్తున్నారని ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రశంసించారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా స్పందించారు. 2014, 2019, 2024 పార్లమెంటరీ ఎన్నికలను ప్రశ్నించడం ద్వారా రాహుల్ (Rahul Gandhi) భారత ఓటర్లను, ప్రజాస్వామ్య ప్రక్రియను అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరింత అవమానకరమైన ఓటమి తప్పదని ఆయన హెచ్చరించారు.