మోదీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో

అదానీ గ్రూపు సంస్థ ఓనర్ గౌతం అదానీపై అమెరికా కోర్టులో నేరాభియోగాలు నమోదు అయ్యాయి. న్యూయార్క్ జడ్జి తన ఆదేశాల్లో అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. గౌతం అదానీ భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు స్పష్టం అవుతున్నదని రాహుల్ ఆరోపించారు. మోదీ, అదానీ కలిసి ఉంటే, ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని రాహుల్ పేర్కొన్నారు. అదానీని తక్షణమే అరెస్టు చేయాలన్నారు. మదహబి పురి బుచ్ ఈ కేసులో విచారించాలన్నారు.