బిలియనీర్ల ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారు : రాహుల్

ప్రధాని మోదీ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడ్డా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బిలియనీర్ల ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విపక్ష కూటమి పోరాడుతుంటే, బీజేపీ మాత్రం దాన్ని చెత్తబుట్టలో పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాహుల్ రెడ్‌బుక్ చూపెడుతున్నారని ప్రధాని మోదీ చెబుతున్నారు. దాని రంగు ముఖ్యం కాదు, అందులో ఉన్న కంటెంట్ ముఖ్యం. దాన్ని చదివి ఉంటే, విద్వేషం వ్యాప్తి, సమాజాన్ని విభజించే ప్రయత్నం చేయరు. ఇది విపక్షకూటమి, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య జరుగుతోన్న పోరాటం. మేము రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతుంటే, కులం, మతం ఆధారంగా విద్వేషాలతో సమాజాన్ని విభజించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు అని రాహుల్ విమర్శించారు.