అమెరికా అధ్యక్షుడిలా మన ప్రధానికీ : రాహుల్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపకశక్తి లాస్ అయిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మధ్య మేం ఏది మాట్లాడితే మోదీ కూడా అదే మాట్లాడుతున్నారని, బహుశా ఆయనకు జ్ఞాపకశక్తి నశించి ఉంటుందని ఆయన అన్నారు. ఇటీవల ప్రధాని మోదీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేమేం మాట్లాడినా ఆయనా అదే చెప్తున్నారని తెలిపింది. బహశా ఆయనకు మెమరీ లాస్ అయిందేమో. జో బైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధానికి కూడా మతి పోయిందేమో అని మహారాష్ట్ర సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.