కేంద్ర మంత్రి అమిత్‌షాతో రఘురామ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన ఉపసభాపతి ఇక్కడి పార్లమెంటు భవనంలో హోంమంత్రిని కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. కూటమి రాష్ట్రంలో ఘన విజయం సాధించి, ఉపసభాపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ కొచ్చిన రఘురామ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కూటమి పాలన గురించి కేంద్ర మంత్రికి వివరించారు. కూటమి తరపున డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు.