PM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ

కొత్తగా సవరించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఒక లేఖ రాశారు. ఈ సంస్కరణలు దేశంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయని, పొదుపును పెంచుతాయని ఆయన అన్నారు. కొత్త జీఎస్టీ సంస్కరణల్లో ఇకపై రెండు పన్ను శ్లాబులు మాత్రమే ఉంటాయని మోడీ వివరించారు. ఇల్లు, కుటుంబానికి సంబంధించిన అనేక వస్తువులు ఇప్పుడు కేవలం 5 శాతం పన్ను రేటుతో లభిస్తాయని చెప్పారు. బీమా నుండి గృహోపకరణాల వరకు అన్నీ చౌకగా మారాయని, దీనివల్ల ప్రజలు రూ. 2.5 లక్షల కోట్లు ఆదా చేయగలుగుతారని ఆయన (PM Narendra Modi) తెలిపారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతిలోకి వచ్చారని మోడీ (PM Narendra Modi) పేర్కొన్నారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేసుకోవడానికి జీఎస్టీ 2.0 సహాయపడుతుందని, దేశ ప్రజలు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, సోమవారం నాడు ప్రధాని మోడీ త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో పర్యటించారు. త్రిపురలోని మాతా త్రిపుర సుందరి ఆలయాన్ని ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన (PM Narendra Modi) ఆరోపించారు. ఈ పర్యటనలో అరుణాచల్ ప్రదేశ్‌లో రూ. 5,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.