అత్యంత శక్తిమంతుడు ప్రధాని మోదీ … ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు

దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఫ్‌ుచాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలిపింది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల్లో ఐదో స్థానంలో, ముఖ్యమంత్రుల్ల అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడిరచింది. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తిసామర్థ్యాలను అంచనా వేసింది. ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒకవైపు అమెరికాతో మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహసంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారు అని విశ్లేషించింది.