ప్రధాని మోదీ ప్రయాణించే ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. రaార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఢల్లీికి ప్రధాని తిరుగు ప్రయాణం ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ ఉదయం ప్రధాని మోదీ రaార్ఖండ్ లో పర్యటించారు. రెండు ప్రాంతాల్లో ర్యాలీల్లో పాల్గొన్నారు. దాన్ని ముగించుకుని ఢల్లీి తిరిగి వెళ్లేందుకు దేవగఢ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే ప్రధాని ప్రయాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాప్ అవ్వలేదు. ప్రస్తుతం సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.