అమెరికా అభియోగాలపై .. భారత్ దర్యాప్తు

అమెరికాలో అదానీ లంచాల వ్యవహారం భారత సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. అదానీపై అమెరికా న్యాయశాఖ మోపిన అభియోగాలపై భారతీయ దర్యాప్తు సంస్థలతో కూడా సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై తక్షణ విచారణ కోరుతూ ధర్మాసనం ఎదుట ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. భారత్‌లో సౌర విద్యుత్ ఒప్పందాల కోసం అదానీ గ్రూపు రూ.2,029 కోట్లు లంచం ఇవ్వజూపిన ఆరోపణలపై ఆ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తివారీ కేసుకు ప్రాధాన్యం ఏర్పడిరది. హిండెన్‌బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు కోరుతూ గతంలోనూ ఆయన పిటిషన్ వేశారు.