తుదివరకు నాది అదే మాట : ఇన్ఫీ నారాయణమూర్తి

భారతీయులు శ్రమించి పనిచేస్తేనే దేశం ముందుకు పోతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి పేర్కొన్నారు. వారానికి ఆరు పని దినాల విధానానికే తుదివరకు తన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. గ్లోబల్ లీడర్‌షిప్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నన్ను క్షమించండి. నేను నా భావాలను మార్చుకోలేను. నా తుది వరకు దీనికి నేను కట్టుబడి ఉంటాను. ప్రధాని మోదీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మనం కూడా అలాగే కష్టపడటమే అతనికి మనం ఇచ్చే గౌరవం. భారత్ వృద్ధి త్యాగాలు ప్రయత్నాలపైనే ఆధారపడి ఉంటుంది కానీ, సౌకర్యాలు, విశ్రాంతిపై కాదు. బలమైన పని విలువలు లేని దేశం ప్రపంచ స్థాయిలో పోటీపడటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని ఆయన పేర్కొన్నారు.