National: తెలుగు వారికి జాతీయ భూవిజ్ఞాన శాస్త్ర పురస్కారాలు

రాష్ట్రపతి ద్రౌపదీముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా నలుగురు తెలుగువారు ఢల్లీిలో జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర పురస్కారాలు అందుకున్నారు. ఢల్లీిలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (G. Kishan Reddy) సమక్షంలో రాష్ట్రపతి 20 మంది శాస్త్రవేత్తలను మూడు కేటగిరీల్లో మొత్తం 12 పురస్కారాలతో గౌరవించారు. ఖనిజాన్వేషణలో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందానికి రాష్ట్రపతి జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర పురస్కారం ప్రధానం చేయగా అందులో తెలుగువారు సంగంరెడ్డి శ్యాంకుమార్ (Sangamreddy Shyamkumar) , సామల సాయికుమార్ (Samala Saikumar) ఆ గౌరవాన్ని అందుకున్నారు. విశాఖపట్నం సీఎస్‌ఐఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ముఖ్యశాస్త్రవేత్త వేదుల వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాసశర్మ వ్యక్తిగత ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. హిందూ మహాసముద్రంలో బయోకెమికల్ ప్రాసెస్‌లో వస్తున్న తేడాలపై చేసిన పరిశోధనలకు ఈ గౌరవం దక్కింది.