America: 2417 మంది అమెరికా నుంచి భారత్‌కు : విదేశాంగ శాఖ

ఈ ఏడాది జనవరి నుంచి 2,417 మంది భారతీయులను అమెరికా(America) వెనక్కు పంపినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయం వెల్లడిరచింది. భారత్ ( India) అక్రమ వలసదారులను వ్యతిరేకిస్తుందని, చట్టబద్ధమైన వలసలను ప్రోత్సహించాలని కోరుకుంటోందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) తెలిపారు. మూడు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్న 73 ఏళ్ల సిక్కు మహిళ హర్జీత్ కౌర్ (Harjeet Kaur) ను అక్కడి అధికారులు తిరిగి భారత్‌కు పంపించడంతో అక్రమ వలసదారుల బహిష్కరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జనవరి 20 నుంచి సెప్టెంబరు 25 వరకు 2,417 మంది భారతీయులను అమెరికా వెనక్కు పంపినట్లు జైశ్వాల్ తెలిపారు.