ఆయనకు ఏది ఇష్టమైతే అదే వండుతా : దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు

శ్రీరామనవమి నవరాత్రుల సమయంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేపలు తిన్న వీడియో ఇటీవల రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ కూడా విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని కోసం ఏదైనా వండేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోల్‌కతాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో దీదీ మాట్లాడుతూ నేను నా చిన్నప్పటి నుంచి వంట చేస్తున్నా. బాగా వండుతానని చాలామంది చెప్పారు. ప్రధాని కోసం ఏదైనా వండేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ నా చేతివంటను మోదీ అంగీకరిస్తారో లేదో? ఆయనకు ఏది ఇష్టమైతే అదే వండుతా. ఢోక్లా లాంటి శాకాహారంతో పాటు చేపల కూర లాంటి మాంసాహార భోజనం కూడా బాగా వండొచ్చు అని వ్యాఖ్యానించారు.