Narendra Modi:మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అగ్రరాజ్యధినేత

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫోన్‌చేసి మాట్లాడారు. బుధవారం జరగనున్న మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. భారత్ (India) తో సత్సంబంధాలకు, వాణిజ్య ఒప్పందానికి అమెరికా (America) ప్రయత్నిస్తున్నవేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. మిత్రుడైన ట్రంప్ నా జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. మీలాగే నేను మన రెండు దేశాల సమగ్ర సంబంధాలను, ప్రపంచ విషయాల్లో భాగస్వామ్యాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్లడానికి కట్టుబడి ఉన్నాను అని మోదీ తెలిపారు. నా ఫ్రెండుతో అద్భుతమైన ఫోన్‌కాల్ సంభాషణ జరిపాను. ఆయనెంతో బాగా పనిచేస్తున్నారు. నరేంద్ర రష్యా-ఉక్రెయిన్ (Ukraine) యుద్ధాన్ని ముగించేందుకు మీరిస్తున్న సహకారానికి ధన్యవాదాలు అని ట్రంప్ పేర్కొన్నారు.