Islamabad: అవినీతిలో మాకన్నా మీరే టాప్.. అమెరికాకు పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్…

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ సర్కార్ .. అమెరికా ప్రాపకం కోసం వెంపర్లాడుతోంది. అమెరికా షరతులకు తలొగ్గి, ట్రంప్ ను ప్రశంసిస్తూ… అగ్రదేశం అనుగ్రహాన్ని సంపాదించుకుంటోంది. అంతేకాదు.. అగ్రరాజ్యంలో పదేపదే పర్యటిస్తున్న ఆ దేశ ఆర్మీచీఫ్ మునీర్.. పలు ఒప్పందాలకు లైన్ క్లియర్ చేస్తున్నారు. త్వరలో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ కూడా.. అమెరికాలో పర్యటించనున్నారు. ఇలాంటి తరుణంలో కొందరు పాక్ మంత్రులు.. అమెరికా చట్టసభ సభ్యులపై అవినీతి విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సాదారణంగా తమను అవినీతి పరులుగా ప్రపంచం చూస్తుందని.. అయితే తమకన్నా అమెరికా నేతలు అవినీతి పరులని పాక్ మాంత్రి ఇసాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు చెందిన జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ ‘‘మేము లంచాలు స్వీకరించామని తీవ్ర అపవాదులు ఎదుర్కొన్నాం. కానీ, అమెరికా రాజకీయ నాయకులు ఇజ్రాయెల్ నుంచి బహిరంగంగానే లంచాలు తీసుకున్నారు. అదే నేను లంచం స్వీకరించాల్సి వస్తే.. ఎక్కడో చాటుగా తీసుకుంటాను. మేము నిందలు మోశాం కానీ.. వారు బహిరంగంగానే చేస్తున్నారు’’ అని అన్నారు. అమెరికా మిలిటరీ అధికారులు, ప్రతినిధుల సభ సభ్యులు, ఉన్నత స్థాయి పాలకులు తాము ఇజ్రాయెల్ నుంచి నిధులు అందుకున్నట్లు అంగీకరించారన్నారు.
పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Pakistan’s Foreign Minister Ishaq Dar) ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకే షాక్ ఇచ్చారు. భారత్ ఎప్పుడూ మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదన్నారు. ఆయన అల్-జజీరాతో మాట్లాడుతూ ‘‘మూడో పక్షం పాత్ర ఉన్నా మేము ఏమీ అనుకోం. ఇది ద్వైపాక్షిక అంశమే అని భారత్ పేర్కొంది. ఏ చర్చలు జరిగినా.. ఉగ్రవాదం, వాణిజ్యం, జమ్ముకశ్మీర్‌పై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘మే 10వ తేదీన సీజ్ ఫైర్ ఆఫర్ వచ్చిన వేళ.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్-పాక్ చర్చలు తటస్థ వేదికగా జరుగుతాయని చెప్పారు. కానీ, జులై 25వ తేదీన దీనిపై నేను మళ్లీ ఆయన్ను ప్రశ్నించాను. దీనికి రూబియో స్పందిస్తూ.. భారత్ ద్వైపాక్షిక అంశంగానే దీనిని చూస్తోందని తేల్చిచెప్పారని తెలిపారు.