Mukesh Ambani: ఈ రోజు 145 కోట్ల మందికి పండగ రోజు : ముకేశ్ అంబానీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేడు 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఈ సందర్భంగా ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ రోజు 145 కోట్ల మందికి పండగ రోజని అభివర్ణించారు. ఈ రోజు అత్యంత గౌరవనీయులైన, ప్రియమైన మన ప్రధాన మంత్రి నరేంద్రమోజీకి 75వ పుట్టినరోజు. దేశంలోని వ్యాపారవర్గాలు, రిలయన్స్ కుటుంబం (Reliance family) , అంబానీ కుటుంబం (Ambani family) తరపున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ అమృత్ కాల్ సమయంలోనే మోదీజీ అమృత్ మహోత్సవ్ రావడం యాదృచ్ఛికమేమీ కాదు. స్వాతంత్ర భారతానికి 100 ఏళ్లు వచ్చేంతవరకు మోదీ దేశానికి సేవ చేయాలి అని ముకేశ్ అంబానీ ఆకాంక్షించారు.