TTD : సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) ను తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) కలిశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎంకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం చేశారు. బ్రహ్మోత్సవాలకు తిరుమల (Tirumala) లో చేపడుతున్న ఏర్పాట్లపై బీఆర్ నాయుడుతో చంద్రబాబు మాట్లాడారు. టీటీడీ (TTD) తరపు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను టీటీడీ చైర్మన్ వివరించారు.