ఇతర పార్టీల నుంచి వచ్చి, బీజేపీలో ముఖ్యమంత్రులు అయిన వారి జాబితా
బీజేపీ ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటోంది. గతంలో లాగా రాజకీయాలను చేయడం లేదు. మరీ ముఖ్యంగా మోదీ, అమిత్ షా ద్వయం వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ పెరిగిపోయింది. గతంలో అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి పీఠాన్ని కేవలం బీజేపీ నేపథ్యం వున్న వారికి మాత్రమే చాలా జాగ్రత్తగా ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం ‘‘కేవలం విజయ సూత్రం’’ పైనే ఆధారపడి, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా సీఎం పీఠం ఇచ్చేస్తున్నారు.
తాజాగా… బెంగాల్ లో సువేందు అధికారి ప్రమాణ స్వీకారం ఈ తాజా వ్యూహానికి తాజా ఉదాహరణ.తృణమూల్ నుంచి వచ్చినా.. సువేందు బీజేపీ క్రియాశీలక నేతల్లో ఒగరుగా మారిపోయారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చి, బీజేపీలో సీఎంలు అయిన వారి జాబితా పరిశీలిద్దాం.
1. సువేందు అధికారి :
సువేందు అధికారి గతంలో తృణమూల్ లో కీలక నేత. మమతా బెనర్జీకి నమ్మిన బంటు. కానీ.. 2002 లో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి, బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు.. ఏకంగా బెంగాల్ లో బీజేపీ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి చరిత్ర సృష్టించారు.
2. హిమంత బిస్వ శర్మ:
ఈ నేత కూడా గతంలో కాంగ్రెస్ లో వుండేవారు. అసోం కాంగ్రెస్ లో అత్యంత కీలక నేతగా వుండేవారు. కానీ.. రాహుల్ గాంధీతో వచ్చిన పొరపొచ్చాల కారణంగా 2015 లో పార్టీని వీడి, బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల బీజేపీ వ్యవహారాల్లో అత్యంత కీలక నేతగా మారిపోయారు. బీజేపీ కూడా ఈయన తెలివి తేటలను గ్రహించి, ముఖ్యమంత్రిగా చేసింది.
3. పేమా ఖాండు :
అరుణాచల్ ప్రదేశ్ లో అత్యంత కీలక నేత. 2016 వరకూ కాంగ్రెస్ లో వుండేవారు. కానీ.. ఆ తర్వాత 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి PPA పార్టీలో చేరారు. రెండు నెలల తర్వాత, ఆయన PPA నుండి కూడా విడిపోయి, 32 మంది ఎమ్మెల్యేలతో సహా BJPలో చేరారు.ఆ తర్వాత బీజేపీ నుంచి సీఎం అయ్యారు.
4. బీరెన్ సింగ్ :
మణిపూర్ లో ఈయన ఒకప్పుడు కాంగ్రెస్ సర్కార్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2016 లో బీజేపీలో చేరారు. 2017 లో మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఆయననే బీజేపీ ముఖ్యమంత్రిగా చేసింది.
5. మాణిక్ షాహ :
ఈయన త్రిపురలో కీలక నేత. కాంగ్రెస్ లో కీలకంగా వుండేవారు. 2016 లో కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేసి, బీజేపీలో చేరిపోయారు. 2020 నుంచి 2022 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తర్వాత 2022 లో బీజేపీ ఈయనను ముఖ్యమంత్రిగా చేసింది.
6. సామ్రాట్ చౌదరి :
సామ్రాట్ చౌదరి ఆర్జేడీ, జేడీయూలో కీలక నేతగా వుండేవారు. నితీశ్ కి, లాలూకి అత్యంత సన్నిహితుడు. అయితే 2017 లో బీజేపీలో చేరిపోయారు. తాజాగా బీజేపీ ఆయన్ను బిహార్ ముఖ్యమంత్రిని చేసింది.






