Maoist Party: ఆయుధాలు వదలడం జరగదు.. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు?

మావోయిస్టు పార్టీలో (Maoist Party) అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఆయుధాలు వీడుతున్నట్లు గతంలో వచ్చిన లేఖ నకిలీదని, అది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు అభయ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట కొత్తగా విడుదలైన లేఖలో స్పష్టం చేశారు. గతంలో అభయ్ పేరిట కామ్రేడ్ సోను విడుదల చేసిన ప్రకటనను పార్టీ (Maoist Party) కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో ఖండించాయి. ప్రపంచ, దేశీయ పరిస్థితులు సాయుధ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. బసవరాజు మే 7న చేసిన ప్రకటనను కూడా సోను వక్రీకరించారని పార్టీ (Maoist Party) ఆరోపించింది. ఒకవేళ పార్టీలో (Maoist Party) ఒంటెద్దు పోకడలు ఉంటే, ప్రత్యామ్నాయ పంథాను సూచించి పోరాటం చేయవచ్చని, కానీ సాయుధ పోరాటాన్ని విరమించడం పార్టీ కార్యకర్తలను, ప్రజలను మోసం చేయడమేనని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో మావోయిస్టు పార్టీలో (Maoist Party) సాయుధ పోరాట కొనసాగింపుపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తోంది.