Supreme Court: ఆ లాయర్‌కు సుప్రీంకోర్టులోకి ప్రవేశం రద్దు

సుప్రీంకోర్టు లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai) పై ఓ న్యాయవాది దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడిన న్యాయవాది రాకేశ్ కిశోర్(Rakesh Kishore) పై సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ చర్యలు ప్రారంభించింది. రాకేశ్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతోపాటు న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డు (Entry card) ను రద్దు చేసింది. తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడిరచారు. ఇలాంటి అస్థిరమైన ప్రవర్తన కోర్టు అధికారికి పూర్తిగా తగదని, వృత్తిపరమైన నీతిని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది.