Modi :సీడీఎస్, డొభాల్‌లతో… మోదీ కీలక భేటీ

పహల్గాం దాడి (Pahalgam attack) అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఢల్లీిలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ (Ajit Doval), త్రివిధ దళాల అధిపతులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో అంతర్గత భద్రతతోపాటు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.