ఎస్ సీబీఏ అధ్యక్షుడిగా కపిల్ సిబల్

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కపిల్ సిబల్ విజయం సాధించాడు. కపిల్ సిబల్‌కు 1,066 ఓట్లు రాగా, ప్రత్యర్థి సీనియర్ కౌన్సిల్ ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు వచ్చాయి. సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2001`02 పని చేశారు. అంతకు ముందు 1995`96, 1997`98లలోనూ రెండుసార్లు సుప్రీంకోర్టు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కపిల్ సిబల్ ఎన్నికల పట్ల పలువురు న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు. సిబల్‌కు పూలదండలు వేసి సత్కరించారు.