KTR: తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా : కేటీఆర్

రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జాతీయ సమైక్యతా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వేలాది మంది ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు. పోరాట యోధులకు, అమర వీరులందరికీ శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కేసీఆర్ (KCR) ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం, అన్నింటినీ తెలంగాణ చూసింది. చాకలి ఐలమ్మ(Chakali Ailamma) , షేక్ బందగి, రావి నారాయణరెడ్డి (Ravi Narayana Reddy) వంటి ఎందరో అమరవీరులు ఈ తెలంగాణలో జన్మించారు. రాష్ట్రంలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటాం. ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒలిపింక్స్ (Olympics) గురించి మాట్లాడుతోంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపైనా బీఆర్‌ఎస్ పోరాడుతూనే ఉంటుంది అని అన్నారు.