BR Gavai : కొత్త సీజేఐగా జస్టిస్ గవాయ్ నియామకం

భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) నియమించారు. మే 14న ఆయన చేత రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna) మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 52వ సీజేఐగా జస్టిస్ బి.ఆర్.గవాయ్‌ని రాష్ట్రపతి నియమించినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ వెలువరించింది. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి (Supreme Court Judge ) గా ఉన్న ఆయన అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీ విరమణ చేస్తారు.