Supreme Court: సివిల్ జడ్జీలకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్

ఏడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీసు చేసిన అనంతరం కింద కోర్టుల జడ్జీలుగా నియమితులైన వ్యక్తులు న్యాయవాదుల సంఘం (బార్) కోటా కింద జిల్లా జడ్జీలుగా నియామకానికి అర్హులా, కాదా అనే విషయంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పును వెలువరించింది. జిల్లా న్యాయమూర్తులుగా సివిల్ జడ్జీలు (Civil Judges) గా పరిగణించొచ్చని తెలిపింది. న్యాయవాదుల కోసమే ఉన్న ప్రత్యేక నియామక ప్రక్రియ కింద జ్యుడీషియల్ అధికారులు జిల్లా న్యాయమూర్తులుగా నియమితులు కావొచ్చని వెల్లడిరచింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ (Justice B.R. Gavai) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టు (High Court) లతో సంప్రదించి, మూడు నెలల వ్యవధి లోపు ఈ తీర్పునకు అనుగుణంగా నిబంధనలను సవరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా జడ్జీల నియామకాలపై విస్తృత ప్రభావం చూపనుంది.