యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు

ఇన్ఫోసిస్ సైన్స్ ఫాండేషన్ (ఐఎస్‌ఎఫ్) బహుమతులకు ఆర్థికశాస్త్రం, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, సాంఘిక, జీవ, గణిత, భౌతిక శాస్త్ర విభాగాల నుంచి ఆరుగురిని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ బెంగళూరులో ప్రకటించింది. అవార్డుకు ఎంపికయిన వారంతా 40ఏళ్లలోపు వారేనని ఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు క్రిస్ గోపాలకృష్ణన్ తెలిపారు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అరుణ్ చంద్రశేఖర్ (ఎకనామిక్‌స), యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ శ్యామ్ గొల్లకోట ( ఇంజినీరింగ్ అండ్ కంప్యూర్ సైన్సెస్), యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరో ఆచార్యుడు మహ్మద్ కూరియా ( హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్), పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో అసిసియేట్ ప్రొఫెసర్ సిద్దేశ్ కామత్ ( లైఫ్ సైన్సెస్), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (కోల్‌కతా) ఆచార్యులు నీనాగుప్తా ( మ్యాథమ్యాటికల్ సైన్సెస్), స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ వేదిక కీమాణి ( భౌతికశాస్త్రం)లకు ఈ అవార్డులకు ఎంపిక చేశారు.