Petrol Bunk: పెట్రోల్ బంక్‌లో సిగరెట్ కాల్చొద్దన్నందుకు.. ఫ్యూయల్ ట్యాంక్‌కు నిప్పు!
పెట్రోల్ బంకుల్లో (Petrol Bunk) చిన్న నిప్పురవ్వ కూడా పెను ప్రమాదానికి దారితీస్తుందని తెలిసిందే. అందుకే అక్కడ ఫోన్లు వాడటం, సిగరెట్లు కాల్చడం నిషిద్ధం. అయితే చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. పెట్రోల్ పోయిస్తున్న సమయంలో సిగరెట్ కాల్చొద్దని వారించినందుకు, ఏకంగా బైక్ పెట్రోల్ ట్యాంకులోనే లైటర్‌ను పడేసి నిప్పంటించాడు. ఈ భయంకరమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అసలేం జరిగింది?
ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి సుమారు 7:40 గంటల సమయంలో రాయ్‌పుర్‌లోని ఒక బిజీ పెట్రోల్ పంపు (Petrol Bunk) వద్దకు ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. వారిలో ఒకరు బైక్‌పై కూర్చుని పెట్రోల్ పోయిస్తుండగా, వెనుక ఉన్న యువకుడు కిందకు దిగి తన జేబులో నుంచి లైటర్ తీసి సిగరెట్ అంటించడానికి ప్రయత్నించాడు. పెట్రోల్ వేగంగా ట్యాంకులోకి వెళ్తున్న సమయంలో ఆ ప్రాంతమంతా పెట్రోల్ వాసన వస్తూ, ఆవిర్లు ఉంటాయి. ఇది గమనించిన బైక్ మీద ఉన్న వ్యక్తి అతడిని ఆపడానికి ప్రయత్నించాడు. సిగరెట్ తాగడం ప్రమాదకరమని వారించాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
క్షణాల్లో అంటుకున్న మంటలు:
వారించినందుకు కోపానికి గురైన ఆ యువకుడు.. క్షణం కూడా ఆలోచించకుండా తన చేతిలోని లైటర్‌ను వెలుగుతుండగానే నేరుగా బైక్ ఫ్యుయల్ ట్యాంక్ లోపల పడేశాడు. ఇంకేముంది క్షణాల్లో పెట్రోల్ ట్యాంకు (Petrol Bunk) నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఆ మంటలు బంకు మొత్తానికి వ్యాపించి పెను విధ్వంసం జరిగేది.
కటకటాల్లో నిందితులు:
మంటలు చెలరేగగానే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ఇద్దరు యువకులను బంకు (Petrol Bunk) సిబ్బంది, స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. స్వల్ప కారణానికే అంతమంది ప్రాణాలను పణంగా పెట్టిన ఆ యువకుడి తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రమాదకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి

















