మహా సీఎం ఎంపికపై వారిదే తుది నిర్ణయం

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ తాజా పరిణామాలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే స్పందించారు. సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షాలదే తుది నిర్ణయమని, వారు తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామన్నారు. మహాయుతికి చరిత్రాత్మక విషయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలిపిన ఆయన తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని అన్నారు. మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో తెల్లవార్లు పనిచేశా, రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయా. ఒక కార్యకర్తలా చెప్పులరిగేలా తిరిగా, నా దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. కష్టాలన్నీ తెలుసు. మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చాం. సీఎంగా ఎటువంటి అసంతృఫ్తి లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు అండగా నిలిచారు. తాజా పరిణామాలపై వారితో ఫోన్‌లో మాట్లాడా. సీఎం ఎంపిక విషయంలో వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.