ట్రంప్ రాక భారత్‌కు సానుకూలమే : నాగేశ్వరన్

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం భారత్‌కు సానుకూలమేనని భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు జి.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. జీడీపీ వృద్ధికి కీలకమైన ఇంధన ధరలు ట్రంప్ పరిపాలనలలో అదుపులో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా టమోట, బంగాళాదుంప, ఉల్లి ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం పెచ్చుమీరుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ వార్షిక బ్యాంకింగ్, ఎకనామిక్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ వచ్చే 25 ఏళ్లలో భారత్ అధిక వేగంతో వృద్ధి చెందాలంటే, ఇంధన ధరలు అందుబాటులో ఉండాలన్నారు.