PM Modi: అవినీతి స్కాముల్లో డీఎంకే మంత్రుల పోటీ: ప్రధాని మోదీ
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలు, యువత, రైతులను నిలువునా దోచుకుంటున్న డీఎంకే ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఏమాత్రం లేదని ఆయన తేల్చిచెప్పారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ.. ఆదివారం మదురైలో జరిగిన ఎన్డీయే (NDA) భారీ బహిరంగ సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి మంత్రం.. కూటమి బలం..
ఈ సభలో అన్నాడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర మిత్రపక్షాల నేతలతో ప్రధాని మోదీ (PM Modi) వేదిక పంచుకున్నారు. తమిళనాడులో ఎన్డీయే కూటమికి అన్నాడీఎంకే నాయకత్వం వహిస్తోందని, ఇందులో బీజేపీ, ఏఎంఎంకే (AMMK) తదితర పార్టీలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సభకు ముందు ‘అభివృద్ధి చెందిన తమిళనాడు – అభివృద్ధి చెందిన భారత్’ అనే నినాదంతో రాష్ట్రంలో రూ.4,400 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
అవినీతి కుంభకోణాల్లో మంత్రుల పోటీ..
డీఎంకే మంత్రుల తీరుపై ప్రధాని (PM Modi) ఘాటు విమర్శలు చేశారు. సాధారణంగా మంత్రులు ప్రజలకు మంచి పనులు చేయడంలో పోటీ పడితే.. డీఎంకే మంత్రులు మాత్రం అవినీతి స్కాముల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వెలుగుచూసిన భారీ కుంభకోణాలను ఆయన ప్రస్తావించారు.
రూ. 4,700 కోట్ల ఇసుక తవ్వకాల కుంభకోణం.
రూ. 1,000 కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టుల స్కామ్.
రూ. 900 కోట్ల నిరుద్యోగుల (జాబ్) స్కామ్.
రూ. 365 కోట్ల అధికారుల బదిలీల (ట్రాన్స్ఫర్) స్కామ్.

కచ్చతీవు దీవిపై డీఎంకే మౌనం దారుణం..
1970వ దశకంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకమైన ‘కచ్చతీవు దీవి’ని శ్రీలంకకు ధారాదత్తం చేస్తే.. అప్పట్లో డీఎంకే మౌనంగా ఉండి తమిళనాడుకు ఘోరమైన అన్యాయం చేసిందని ప్రధాని మోదీ (PM Modi) ఆరోపించారు. ఆరు దశాబ్దాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారానికి దూరంగా ఉంచినందుకే.. ఆ పార్టీ తమిళులపై ఇలా ప్రతీకారం తీర్చుకుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలు ఇప్పటికే గట్టి నిర్ణయానికి వచ్చారని ప్రధాని (PM Modi) ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి

















