నిధుల కొరత వల్ల కొన్ని హామీలు ఆపేయాలన్న ఎమ్మెల్యేపై డికే శివకుమార్ సీరియస్!

కర్ణాటకలో షాకింగ్ సీన్ వెలుగు చూసింది. నిధుల కొరత కారణంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలను నిలిపేయాలన్న సొంత పార్టీ ఎమ్మెల్యేపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయనగర ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప.. నిధుల కొరత కారణంగా చూపించి, కొన్ని హామీలను నిలిపేయాలని సీఎం సిద్ధరామయ్యను కోరారు. దీన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్రంగా పరిగణించారు. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిసైడయ్యారు. గ్యారెంటీలను నిలిపేయడం మాత్రం కుదరదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏ హామీ విషయంలోనూ వెనక్కిపోదని తేల్చిచెప్పారు. హామీలు రద్దు చేయాలన్న పార్టీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్లు చెప్పారు.