కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య స్థాయిని తగ్గించేందుకు షిప్టుల్లో పనిచేసే ఉద్యోగులకు సమయం విషయంలో వెసులుబాటు కల్పించింది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది పూల్ వెహికల్ విధానాన్ని అనుసరించాలని కోరింది. అలాగే, ప్రజా రవాణాను వినియోగించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచించింది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలు, సంస్థల కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొంది. ఆఫీసర్లు, సిబ్బంది ఈ సమయాలను పాటించాలని కోరింది. ఆఫీసుర్లు / సిబ్బంది వ్యక్తిగత వాహనాల్లో పూలింగ్ విధానాన్ని ప్రోత్సహించాలని సూచించింది.