ఇస్రో శుక్రయాన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కీలకమైన మిషన్లు చేపట్టబోతున్నది. వీనస్‌తో పాటు గగన్‌యాన్, చంద్రయాన్`3 ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నది. 2028లో ఇస్రో శుక్రయాన్ మిషన్ ప్రయోగించనుండగా, ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో డైరెక్టర్ నీలేవ్ దేశాయ్ తెలిపారు. సింథటిక్ ఎపర్చర్ రాడార్, ఆల్ట్రావైలెట్ ఇమేజింగ్ సిస్టమ్ తదితర అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలతో శుక్రుడి వాతావరణంపై పరిశోధన జరుపనున్నది. దట్టమైన కార్బన్‌డయాక్సైడ్, సల్ప్యూరిక్ ఆమ్లం, క్రియాశీల అగ్నిపర్వతాలను గుర్తించడంతో పాటు గ్రహం భౌగోళిక కార్యకలాపాలను అంచనా వేయడం మిషన్ లక్ష్యాల్లో ఒకటి. చంద్రయన్`3 విజయం తర్వాత జపాన్‌తో కలిసి చంద్రయాన్-4 ఇస్ట్రో చేపట్టనున్నది. ఈ ప్రాజెక్టులో చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి చేరుకునేలా ప్రయోగం చేపట్టబోతున్నది.