Caste Survey: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వచ్చే జనాభా లెక్కల్లోనే

దేశంలో కులగణన (Caste Survey )కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి అశ్వినీ వైష్టవ్ (Ashwini Vaishtav) మీడియాకు వెల్లడిరచారు. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ( సీసీపీఏ) ను సూపర్ కేబినెట్‌గా వ్యవహరిస్తారు. నేడు జరిగిన భేటీలో కులగణనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడిరచారు.కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయన్నారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని చేపట్టారని విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోదీ ప్రభుత్వం (Modi government) సంకల్పమని తెలిపారు. ఏప్రిల్ 2020లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ (Covid) కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.