Bihar: ఎన్నికల వేళ బిహార్ మహిళలకు … నవరాత్రి కానుక

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బిహార్ (Bihar) ప్రభుత్వం అక్కడి మహిళలకు నవరాత్రి కానుక అందించింది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) , ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన ప్రారంభించడం ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. ఢల్లీిలో ఉన్న మోదీ వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar) , ఇతర మంత్రులు హాజరయ్యారు. రూ.7,500 కోట్లతో బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మహిళా సాధికారత, స్వయంఉపాధి కల్పించడం దీని ఉద్దేశం. ప్రతి కుటుంబంలో ఒక మహిళలకు ఈ స్కీమ్ కింద రూ.10 వేలు నేరుగా అందాయి.