Jammu & Kashmir: జమ్మూలో ఎన్‌కౌంటర్ లో జవాన్ మృతి.. భారీగా బలగాల తరలింపు

జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu And Kashmir) బసంత్‌గఢ్‌లో ఉగ్రవాద కదిలకలున్నాయనే విశ్వసనీయ వర్గాల సమాచారంతో భారత సైన్యం ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టాయి. అయితే ఈ ఆపరేషన్స్‌లోనే ఒక ఆర్మీ జవాన్ వీరమరణం పొందినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సమీపంలోని బేస్ క్యాంపుల నుంచి మరిన్ని బలగాలను బసంత్‌గఢ్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఒకవైపు ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే, మరోవైపు కాశ్మీర్ లోయ (Jammu And Kashmir) అందాలను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. పర్యాటక ప్రాంతాల్లో భద్రత పెంచాలని ఉన్నతాధికారులు అమిత్ షాకు విన్నవించడంతో, ఆర్మీ-పారామిలటరీ బలగాలు ఆ ప్రాంతాల్లో పర్మినెంట్‌గా కాపలా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది.