Draupadi Murmu : రాష్ట్రపతితో అమిత్ షా, జై శంకర్ కీలక భేటీ

పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. పహల్గాంలో 26 మంది భారతీయుల్ని ఉగ్రవాదులు కిరాతంగా కాల్చి చంపిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన కేంద్రం, పాక్‌తో సింధు నదీ (sindhu river) జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, పాక్ జాతీయులకు అన్ని వీసా (Visa)లను రద్దు చేస్తున్నట్లు తాజా గా ప్రకటించింది. ఇందుకు ప్రతిగా పాక్ సైతం భారత విమానాలకు గగనతలాన్ని మూసివేయడం వంటి చర్యలు తీసుకుంది. ఇరుదేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar ) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu)తో భేటీ కావడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు సంబంధించిన పలు అంశాలను ఆమెకు వివరించినట్లు సమాచారం.