విజయ్ తో మంత్రులుగా పనిచేసిన వారి నేపథ్యమిదీ..
తమిళనాడులో ఎట్టకేలకు విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వ కొలువుదీరింది. శనివారం ఉదయం గవర్నర్ ఆర్లేకర్ విజయ్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ తో పాటు 9 మంది టీవీకే నేతలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. యువత, రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణాలు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లే క్షమత ఆధారంగా వీరిని కేబినెట్ లోకి తీసుకున్నారు. ఈ తొమ్మిది మంది గురించి పరిశీలిద్దాం.
1. కేఏ సెంగొట్టియన్ : 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. సామాన్య కార్యకర్తలా మొదలై, 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంజీఆర్ టైమ్ లో తొలిసారి ఎమ్మెల్యే. ఆ తర్వాత జయలలిత, పళనిస్వామి హాయాంలోనూ మంత్రిగా వున్నారు. జయలలితకు విధేయులుగా వుండేవారు. రెవిన్యూ మంత్రిగా బాగా పేరు తెచ్చుకున్నారు. అన్నాడీఎంకేతో విభేదించి, విజయ్ పార్టీలో చేరారు.
2. ఆధవ్ అర్జున్ : టీవీకే ముఖ్య నేతల్లో ఒకరు. మంచి ఆటగాడు. భారత బాస్కెట్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు కూడా.వీసీకే పార్టీలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా చేసి, విజయ్ పార్టీలో చేరిపోయారు.
3. ఆనంద్ : విజయ్ కి అత్యంత సన్నిహితుడు. టీవీకే ఆవిర్భావం, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. క్షేత్ర స్థాయిలో, ప్రచారంలో బాగా ఉపయోగపడ్డారు.ఈయన్ను బుస్సీ ఆనంద్ అంటారు.టీ నగర్ నుంచి గెలుపొందారు.
4. ఎస్. కీర్తన : శివకాశి నుంచి గెలిచారు. తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు. 29 సంవత్సరాలే. షో టైమ్ కన్సల్టింగ్, ఐపాక్ లో పనిచేశారు. డిజిటల్ క్యాంపెయిన్ వ్యూహకర్తగా వున్నారు.
5. అరుణ్ రాజ్ : మాజీ ఐఆర్ఎస్ అధికారి. వైద్యులు కూడా. ప్రభుత్వ ఉద్యోగం వదిలి, విజయ్ పార్టీలో చేరారు. టీవీకే పాలసీ రూపకల్పన, ప్రచార విభాగాలకు ప్రధాన కార్యదర్శి. తిరుచెంగోడ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
6. నిర్మల్ కుమార్ : వామపక్షాల మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు. టీవీకే ఐటీ, సోషల్ మీడియా చీఫ్ గా వున్నారు. తిరుప్పరన్ కుండ్రం నుంచి గెలిచారు. కొంత కాలం అన్నాడీఎంకేలో వున్నారు. 2025 లో టీవీకేలో చేరారు.
7. రాజ్ మోహన్ : స్టాండప్ కమెడియన్. టీవీకే ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. ప్రచారంలో కీలకంగా వున్నారు.
8. వెంకట రమణన్ : టీవీకే కోశాధికారి. న్యాయవాది కూడా. మైలాపూర్ నుంచి గెలుపొందారు.
9. కేటీ ప్రభు : దంత వైద్యులు. కరైకుడి నుంచి గెలుపొందారు. నటుడు సీమన్ ను ఓడించారు.






