జెలెన్ స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్ పై వేటు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో తన వ్యక్తిగత రక్షణను పర్యవేక్షించే విభాగాధిపతి (బాడీగార్డ్ చీఫ్) పై అధ్యక్షుడు వేటు వేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో స్టేట్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధిపతి సెర్గియ్ లియోనిడోవిచ్ రుడ్ను తొలగించినట్లు వెల్లడించారు. అయితే ఆయన్ను తప్పించడానికి గల కారణాలను మాత్రం బయటపెట్టలేదు.






