ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
కూటమి నాయకులు ఎన్ని అరాచకాలు సృష్టించినా, ఎన్ని దాడులకు పాల్పడినా వైఎస్ఆర్సీపీ జెండాను విడవబోమని ఆస్ట్రేలియా ఎన్నారైలు నినదించారు. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో కార్యవర్గ సభ్యులు వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్చువల్గా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కాకాణి ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి వల్లూరి, కోట శ్రీనివాసరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కర్రీ శ్రీనివాస్ రెడ్డి, ఇరువురి బ్రహ్మారెడ్డి, ఏరువ చిన్నపరెడ్డి, బొమ్మిరెడ్డి జస్వంత్ రెడ్డి, వంశీ చాగంటి, సురేశ్ కనుబుద్ధి, విజయేందర్, ఉమా శంకర్, చంద్రోబుల్ రెడ్డి, హరి, రాకేశ్ పాల్గొన్నారు.






