Tokyo: కార్చిచ్చుల దెబ్బకు వణుకుతున్న జపాన్..
అభివృద్ధి చెందిన దేశం జపాన్ (Japan) ను ప్రకృతి వణికిస్తోంది. ముఖ్యంగా రెండు కార్చిచ్చులు జపాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎంతగా నిలువరించేందుకుప్రయత్నిస్తున్నా.. కార్చిచ్చు ధాటికి వందల ఎకరాల అటవీప్రాంతం కాలి బూడిదైంది. దీంతో అటవీ సమీపగ్రామాల ప్రజల్ని అక్కడి ప్రభుత్వాలు.. సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నాయి. మరోవైపు.. కార్చిచ్చు ఆపేందుకు ప్రయత్నిస్తున్న ఫైట్ ఫైటర్స్ కు కూడా గాయాలవుతున్నాయి.
ఒకాయమాలో కాలిపోతున్న అటవీ ప్రాంతం
పశ్చిమ జపాన్‌లోని అనేక ప్రాంతాలను కార్చిచ్చులు తాకాయి, పశ్చిమ పట్టణాలైన ఒకాయమా(Okayama), ఇమాబారి మరియు అసోలలోచెలరేగిన మంటలు వందలాది హెక్టార్లను భస్మీపటలం చేశాయి.స్థానిక కైగరా పర్వతంపై మంటలు ప్రారంభమై 250 హెక్టార్ల అడవిని తగలబెట్టాయి. షికోకు ప్రధాన ద్వీపంలోని ఎహిమ్ ప్రిఫెక్చర్‌లోని ఇమాబారిలో, మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. మంటల్ని ఆర్పేందుకు
అగ్నిమాపక సిబ్బంది, రక్షణ హెలికాప్టర్లు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ పరిస్థితికి ప్రస్తుతం జపాన్ లో ఉన్న వాతావరణమే కారణమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈసమయంలో అక్కడ భూమి చాలా పొడిగా ఉంటుందని.. దీనికి తోడు అడవిలో చెట్ల నుంచి రాలిన ఆకులు.. చాలా దట్టంగా పరుచుకుని ఉంటాయని చెబుతున్నారు. ఫలితంగా చిన్న నిప్పురవ్వ తగిలినా మొత్తం చుట్టేసి, దావానలంలా వ్యాపిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు అటవీ సంరక్షణను బాధ్యతగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.






