Los Angeles :లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు
హాలీవుడ్‌కు, సంపన్నులకు కేంద్ర స్థానమైన అమెరికాలోని లాస్ ఏంజెలెస్(Los Angeles ) ను కార్చిచ్చు (Fire )చుట్టుముట్టింది. అగ్ని కీలలు ముప్పేట దాడి చేశాయి. మంటల్లో చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వేల మంది కట్టుబట్టలతో ఇళ్లను వదిలి బయటకు వచ్చారు. అగ్నికి ఆహుతులైన ఇళ్లలో హాలీవుడ్ నటుల(Hollywood actors )తో పాటు పలువురు సంపన్నులవీ ఉన్నాయని సమాచారం. కాలిఫోర్నియాలో పర్యటనకు వచ్చిన అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అగ్ని ప్రమాదం కారణంగా లాస్ ఏంజెలెస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన బస చేసిన హోటల్ నుంచి కనుచూపు దూరంలో పొగ కనిపించింది. మూడుచోట్ల ఒకే రోజు కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.






