America : అమెరికాలో ఆగని కార్చిచు…10 వేల కట్టడాలు బుగ్గి

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చుతో ఇప్పటివరకూ పదిమంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 వేల కట్టడాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కార్చిచ్చు కారణంగా ఆస్తి నష్టం సుమారు 150 బిలియన్ డాలర్ల( రూ.12.9 లక్షల కోట్లు)కు పెరగొచ్చని ఆక్యూవెదర్ సంస్థ అంచనా వేసింది. 3.6 లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేశారు. పాలిసేడ్స్ ప్రాంతంలో వేల ఎకరాల్లో మంటలు విధ్వంసం సృష్టించాయి. మంటల్ని అదుపు చేయడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. లాస్ ఏంజెలెస్‌లోని కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) లు తమ విదేశీ పర్యటనల్ని రద్దు చేసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితిలో అమెరికాకు సాయమందించేందుకు సిద్ధమని కెనడా ప్రకటించింది.